దేవినేని ఉమా బెయిల్ పిటిషన్... విచారణ మంగళవారానికి వాయిదా

By Arun Kumar PFirst Published Jul 30, 2021, 12:43 PM IST
Highlights

హత్యాయత్నం కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది.  

అమరావతి: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు బెయిల్ పిటిషన్ పై ఇవాళ(శుక్రవారం) ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.  అయితే స్టేషన్ నుంచి రికార్డు రాలేదు కాబట్టి విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. కానీ స్టేషన్ కేవలం 30కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి వెంటనే తెప్పించి విచారణ జరపాలని ఉమా తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపు న్యాయవాది ఏకీభవించిన న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న సమాచారంతో దేవినేని ఉమ పరిశీలను వెళ్ల్ళారు. ఈ క్రమంలోనే జి. కొండూరులో అలజడి చెలరేగింది. దీనంతటికి మాజీ మంత్రే కారణమంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమ ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై అన్యాయంగా హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఉమ పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 

read more  దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్... రాజమండ్రికి తరలింపు

మరోవైపు దేవినేని ఉమా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే కక్షపూరితంగా ఉమాను అరెస్టు చేశారని మండిపడ్డారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమా రాత్రింబవళ్లు పనిచేశారని, జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ అధినేత ఆకాంక్షించారు. 

కాగా బుధవారం దేవినేని ఉమకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. అంతకుముందు దేవినేని ఉమను హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయం నుంచి జూమ్ కాల్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఉద్దేశ పూర్వకంగానే ముందస్తు ప్రణాళికతోనో మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి ఉమ వెళ్లారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా జి.కొండూరులో అలజడికి దేవినేని ఉమే కారణమని...  అందువల్లే ఆయనను అరెస్ట్ చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. 
 

click me!