ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ఆగష్టు 14వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల వ్యాప్తి జరగకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్టరంలో కరోనా కేసుల వ్యాప్తి పెరగకుండా ఉండేందుకుగాను జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది.ఇవాళ్టి వరకు నైట్ కర్ఫ్యూ ఆంక్షలు ముగియనున్నాయి.దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజుల పాటు ఆంక్షలను పొడిగించాలని నిర్ణయం తీసుకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్టరంలో కరోనా కేసుల వ్యాప్తి పెరగకుండా ఉండేందుకుగాను జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. pic.twitter.com/1EaIZ6clMb
— Asianetnews Telugu (@AsianetNewsTL)
రాత్రి 10 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వాణిజ్య దుకాణాలు రాత్రి 9 గంటలకు మూసివేయలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో పర్యటించే సమయంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఆంక్షలను కూడ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ ఆ జిల్లాల్లో కరోనా అదుపులోకి రావడం లేదు.