కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు: కౌంటర్ దాఖలు చేయాలని జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Feb 7, 2023, 2:27 PM IST
Highlights

కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్ అంశంపై  మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల  20వ తేదీకి వాయిదా వేసింది.  
 

అమరావతి:  కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ  న పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని  ఏపీ హైకోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ  మాజీ మంత్రి హరిరామజోగయ్య  ఈ నెల  6న ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు  మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.కాపులు ఆర్ధికంగా నేటికి వెనుకబడి ఉన్నారని  పిటిషనర్ తరపు న్యాయవాది   పొలిశెట్టి రాధాకృష్ణ  వాదించారు.  ఈడబ్ల్యుఎస్  కోటా కింద  కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు  కల్పించాలని  పిటిషనర్ డిమాండ్  చేశారు.  కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు  లభిస్తే ఆర్ధికంగా బలోపేతం అవుతారని  భావిస్తున్నందునే  రిజర్వేషన్లను  జగన్  సర్కార్  వ్యతిరేకిస్తుందని  పిటిషనర్ తరపు న్యాయవాది రాధాకృష్ణ చెప్పారు. కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి  కౌంటర్ దాఖలు  చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది.  ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  20వ తేదీకి వాయిదా వేసింది. 

also read:కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్: ఏపీ హైకోర్టులో హరిరామజోగయ్య పిటిషన్

కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ  మాజీ మంత్రి హరిరామజోగయ్య 2022 డిసెంబర్ చివర్లో  ఏపీ సీఎంజగన్ కు లేఖ రాశాడు. ఈ విషయమై  స్పందించకపోతే నిరహరదీక్ష చేస్తానని ప్రకటించారు.  ఈ విషయమై  ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో  ఈ ఏడాది జనవరి  1వ తేదీన  హరిరామజోగయ్య  నిరహరదీక్షకు దిగాడు. ఆయనను పోలీసులు   అరెస్ట్  చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే  ఆసుపత్రిలో కూడా   మాజీ మంత్రి దీక్షను కొనసాగించారు.   జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  వినతి మేరకు  జోగయ్య గత నెల  2వ తేదీన   దీక్షను విరమించారు. 

 

click me!