ఆక్సిజన్ లేక కోవిడ్ రోగులు మృతి చెందితే ఎలా?: కరోనాపై ఏపీ హైకోర్టు విచారణ

By narsimha lode  |  First Published May 4, 2021, 3:13 PM IST

ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందితే పరిస్థితి ఏమిటని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్నిప్రశ్నించింది. 


అమరావతి:ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందితే పరిస్థితి ఏమిటని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్నిప్రశ్నించింది. . రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఆక్సిజన్ , బెడ్లు, టెస్టులు, రిపోర్టులు, మందులు, వ్యాక్సినేషన్ పై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. 

also read:అంబులెన్స్ లో ఆక్సీజన్ సిలిండర్ ఖాళీ.. దాచిపెట్టి కోవిడ్ పేషంట్ ను ఎక్కించుకున్న డ్రైవర్.. చివరికి... !

Latest Videos

కరోనా రోగులకు సరిపడు బెడ్స్, సౌకర్యాలు ఉన్నాయా అనే విషయమై హైకోర్టు ఆరా తీసింది. టెస్టుల రిపోర్టులు ఎంత సమయంలో అందిస్తున్నారో చెప్పాలని కోర్టు కోరింది. ఎంత వ్యాక్సిన్ ఉంది, ఎంతమందికి వ్యాక్సిన్ వేశారో తెలపాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది. 

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రేపటి నుండి రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూను అమలు చేస్తోంది ఏపీ సర్కార్.  ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలౌతోంది.  మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచనున్నారు. 

click me!