సమాచార కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డి: గవర్నర్‌కి ఏపీ సర్కార్ సిఫారసు

By narsimha lodeFirst Published May 4, 2021, 12:09 PM IST
Highlights

ఏపీ సమాచార కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్‌కి సిఫారసు చేసింది. 

అమరావతి: ఏపీ సమాచార కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్‌కి సిఫారసు చేసింది. ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం కోసం ఇవాళ ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది.ఈ సమావేశంలో  సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా  హోం మంత్రి మేకతోటి సుచరిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  గవర్నర్ ఈ ఇద్దరి పేర్లను  గవర్నర్ ఆమోదిస్తే సమాచార కమిషనర్లుగా నియామకానికి అడ్డంకి తొలగినట్టే. సమాచార కమిషనర్లు రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరును పర్యవేక్షించనున్నారు. 

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు  ఉల్చాల హరిప్రసాద్‌. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో జర్నలిస్టుగా ఆయన సేవలు అందించారు సుదీర్ఘకాలం పాటు న్యాయవాద వృత్తిలో కాకర్ల చెన్నారెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని  పలు జిల్లాల కోర్టుల్లో, ఉమ్మడి హైకోర్టుల్లో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.  గవర్నర్  ఆమోదం తెలపగానే వీరిద్దరూ సమాచార కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 


 

click me!