ఉట్టి పుణ్యానికి కన్నకూతుర్ని కడతేర్చాడో కసాయి తండ్రి. తన తప్పేంటో తెలియకుండానే కన్న తండ్రి చేతిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విజయవాడ కొత్తపేటలో జరిగిన ఈ విషాద ఘటనలో.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉట్టి పుణ్యానికి కన్నకూతుర్ని కడతేర్చాడో కసాయి తండ్రి. తన తప్పేంటో తెలియకుండానే కన్న తండ్రి చేతిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విజయవాడ కొత్తపేటలో జరిగిన ఈ విషాద ఘటనలో.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తపేట చదును మహాలక్ష్మి అమ్మవారి గుడి సమీపంలోని మాకినవారి వీధిలో జగ్గు పిళ్ల రాజా (35) యుగంధరి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఏడు సంవత్సరాల కుమార్తె ఉంది. యూకేజీ వరకు చదివి కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటుంది.
undefined
రాజా గొల్లపూడిలోని ఓ మెడికల్ షాప్ లో పనిచేసే వాడు. మూడు నెలలుగా పనికి వెళ్లడం లేదు. పని చేయకపోతే ఇంటి ఖర్చులు ఎలా అంటూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఇద్దరు మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో వివాదాన్ని వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో పెడతానని భార్య చెప్పింది.
గురువారం మధ్యాహ్నం యుగంధరి తన కుమార్తెను తీసుకుని ఆ పక్కనే నివాసం ఉండే తల్లి ఇంటికి వెళ్ళింది. రాజా తన భార్యకు ఫోన్ చేసి కూతురుని ఇంటికి పంపించమని చెప్పాడు. ఆ చిన్నారిని ఇంటికి పంపిన వెంటనే యుగంధరి కూడా వచ్చింది. భర్తతో మాట్లాడుకున్న కాసేపటికి తిరిగి యుగంధరి తల్లి ఇంటికి వెళ్లిపోయింది.
అక్కడే ఉన్న చిన్నారి మంచంపై బోర్లా పడుకుని రెండు చేతులు దిండుమీద పెట్టుకుని తలపైకెత్తి ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటుంది. అది చూసిన తండ్రి రాజాకు ఏమనిపించిందో ఏమో తెలియదు. కానీ ఆ చిన్నారి తలపై చేతులు పెట్టి దిండుకు గట్టిగా అదిమాడు.
దీంతో గిలగిలా కొట్టుకుంటూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. కాసేపటికి ఇంటికి వచ్చిన యుగంధరి కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి చుట్టుపక్కల వారి సాయంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారితో పాటు తండ్రి కూడా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నట్లు సమాచారం.