ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: జగన్ సర్కార్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lode  |  First Published Dec 29, 2020, 12:09 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. 


అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని  ఆదేశించింది.ఇవాళ్టి నుండి వచ్చే మూడు రోజుల్లోపుగా కలవాలని ఏపీ హైకోర్టు  కోరింది.

Latest Videos

undefined

also read:ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహణ సాధ్యం కాదు: హైకోర్టులో జగన్ సర్కార్ అడిషనల్ అఫిడవిట్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కలవాలని  ఏపీ హైకోర్టు కోరింది. ఎక్కడ కలవాలనే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతారని ఏపీ హైకోర్టు తెలిపింది.ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని ఏపీ హైకోర్టు ప్రకటించింది.

ఏపీ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో  ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వైఎస్  జగన్ సర్కార్  ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 
 

click me!