గన్నవరంలో మళ్లీ ఉద్రిక్తత: ఎమ్మెల్యే వంశీని అడ్డుకొన్న మల్లవల్లి గ్రామస్తులు

By narsimha lodeFirst Published Dec 29, 2020, 11:56 AM IST
Highlights

కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గ్రామంలోకి రాకుండా మల్లవల్లి గ్రామస్తులు అడ్డుకొన్నారు. దీంతో ఎమ్మెల్యే వంశీ వెనుదిరిగారు.
 

న్నవరం: కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గ్రామంలోకి రాకుండా మల్లవల్లి గ్రామస్తులు అడ్డుకొన్నారు. దీంతో ఎమ్మెల్యే వంశీ వెనుదిరిగారు.

ఇళ్ల పట్టాం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్లవల్లి గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే వంశీ ప్లాన్ చేశారు. అయితే తమ గ్రామంలో 1400 మంది రేషన్ కార్డులుంటే 400 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై  గ్రామస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలోకి ఎమ్మెల్యే వంశీ రాకుండా  రోడ్డుపై వాహనాలు అడ్డుపెట్టి గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వర్గీయులకు  యార్గగడ్డ వెంకట్రావు వర్గీయులకు మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకొంటున్న విషయం తెలిసిందే. తన వైరి వర్గం ఈ గ్రామస్తుల వెనుక ఉందా అనే కోణంలో కూడ వంశీ వర్గం అనుమానిస్తోంది.

ఇవాళ ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తానని వంశీ చెప్పారు. గ్రామస్తులు వంశీని అడ్డుకొన్న విషయం తెలుసుకొన్న పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

click me!