మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Dec 27, 2022, 3:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి ఎన్‌వోసీ జారీ అంశంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి ఎన్‌వోసీ జారీ అంశంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. వివరాలు.. మంత్రి విడదల రజిని చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి  తెలిసిందే. అయితే చిలకలూరి పేట మండలం మురికిపూడిలో అసెన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలైంది. రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడంపై అసైన్డ్ రైతులు  అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో మంత్రి రజిని హస్తం ఉందని ఆరోపించారు. 

ఈ రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. మంత్రి విడదల రజిని, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎమ్మార్వోకునోటీసులు జారీ చేసింది. పిటిషన్ల కోర్టు తుది నిర్ణయానికి లోబడి.. లీజు ఖరారు ఉంటుందని  స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. 

click me!