అక్రమ ఆయుధాలు, నకిలీ కరెన్సీ సరఫరా: కర్ణాటక జంషీద్ ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు

Published : Dec 27, 2022, 02:33 PM ISTUpdated : Dec 27, 2022, 05:25 PM IST
 అక్రమ ఆయుధాలు, నకిలీ కరెన్సీ సరఫరా: కర్ణాటక జంషీద్ ముఠాను  అరెస్ట్  చేసిన అనంత పోలీసులు

సారాంశం

కర్ణాటకకు చెందిన  జంషీాద్  ముఠాను  అనంతపురం పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్  చేసి విచారిస్తున్నారు.

అనంతపురం: అక్రమంగా ఆయుధాలు , నకిలీ కరెన్సీని  సరఫరా చేస్తున్న కర్ణాటకకు చెందిన జంషీద్ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్  చేశారు.  నకిలీ కరెన్సీకి చెందిన  సమాచారం ఆధారంగా  పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తే  కీలక విషయాలు వెలుగు చూశాయి.  అక్రమంగా ఆయుధాలు  సరఫరా చేసే ముఠాను పోలీసులు గుర్తించారు. అక్రమంగా  ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాతో  కర్ణాటకకు చెందిన జంషీద్  ముఠాకు లింకులను పోలీసులు గుర్తించారు. ఈ లింకుల ఆధారంగా  జంషీద్  ముఠాను  పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితులు ఉపయోగించిన  సెల్ ఫోన్లలో  పలువురిపై దాడులకు సంబంధించిన వీడియో దృశ్యాలను  పోలీసులు  గుర్తించారు. జంషీద్, షఫీవుల్లా, అమీర్ బాషా, ముబారక్ లపై  కర్ణాటక రాష్ట్రంలో  45 క్రిమినల్ కేసులు నమోదైనట్టుగా  పోలీసులు చెప్పారు.ఈ  నలుగురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శ్రీవారి రూ. 300 టికెట్లు ఎందుకు దొర‌క‌డం లేదు, ఆన్‌లైన్ బుకింగ్‌లో స‌మ‌స్య ఏంటి.?
Laddu ATM: ఈ ఏటీఎం నుంచి లడ్డూలు వస్తాయి.. ఎక్క‌డుంది, ఎలా ప‌ని చేస్తుందంటే.?