ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: ఈడీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lode  |  First Published Mar 15, 2023, 3:57 PM IST

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  ఈడీకి  ఏపీ హైకోర్టు  ఇవాళ  కీలక ఆదేశాలు  జారీ చేసింది. 


అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  ఏపీ హైకోర్టు   బుధవారంనాడు ఈడీకి  కీలక ఆదేశాలు జారీ చేసింది.  కస్టడీలో  ఉన్న నిందితులను   సాయంత్రం ఐదున్నర వరకే  విచారించాలని  ఏపీ హైకోర్టు  ఆదేశించింది.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  రిమాండ్  ను సవాల్  చేస్తూ  దాఖలైన  పిటిషన్ పై   ఏపీ హైకోర్టు  ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్దంగా  ఈడీ ప్రశ్నిస్తుందని  కోర్టుకు  పిటిషనర్లు తెలిపారు.  ఈ పిటిషన్లపై విచారించిన  ఏపీ హైకోర్టు  ఇవాళ కీలక ఆదేశాలు  జారీ చేసింది. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  అరెస్టైన  నలుగురు నిందితులను  ఈ నెల  13వ తేదీన  కోర్టు కస్టడీకి అనుమతించింది.  వారం రోజుల పాటు  ఈ నలుగురు నిందితులను విచారించనున్నారు.  

Latest Videos

undefined

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  ఈనెల  రెండో వారంలో  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.  సీమెన్స్ మాజీ ఎండీ శేఖర్,  బోస్, డీజీ టెక్  ఎండీ వికాస్  వినాయక్,  పీపీఎస్‌పీ ఐటీ ప్రాజెక్టు సీఈఓ   ముకుల్ చంద్ర అగర్వాల్ , ఎస్ఎస్ఆర్ అసోసియేట్స్  సురేష్ గోయల్ ను  ఈడీ అధికారులు  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.

యవతకు  శిక్షణ ఇచ్చి  ఉపాధి కల్పించాలని  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కీమ్ ను  చంద్రబాబు  సర్కార్  అమల్లోకి తీసుకు వచ్చింది.   ఈ పథకంలో  అవకతవకలు జరిగాయని    జగన్ ప్రభుత్వం అనుమానించింది.  ఈ పథకంపై సీఐడీ విచారణకు  ఆదేశాలు  జారీ చేసింది.  ఈ ఆదేశాల మేరకు  సీఐడీ కేసు నమోదు  చేసుకొని దర్యాప్తును ప్రారంభించింది.  

also read:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : దర్యాప్తు వేగవంతం.. ఈడీ కస్టడీకి నలుగురు నిందితులు

సీఐడీ అధికారులు షెల్ కంపెనీలను  గుర్తించాయి.  ఈ వ్యవహరంలో  మనీలాండరింగ్  జరిగిందని ఈడీ అధికారులు అనుమానించారు.ఈ విషయమై  విచారణకు  ఈడీకి  సీఐడీ  అధికారులు  లేఖ రాశారు.ఈ లేఖ ఆధారంగా  ఈడీ  అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.  2022 డిసెంబర్ మాసంలో  26 మందిని  ఈడీ అధికారులు విచారించారు.  ఈ మాసంలో  నలుగురిని ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. 


 


 

click me!