ఐఆర్, హెచ్ఆర్ఏ అడ్జెస్్ట్ మెంట్ ను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మూడు వారాలకు విచారణను వాయిదా వేసింది.
అమరావతి: IR, HRA అడ్జెస్ట్ మెంట్ ను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఏ ఉద్యోగి జీతం నుండి రికవరీ చేయవద్దని కూడా AP High Court స్పష్టం చేసింది. ఈ విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. PRC జీవోల్లో ఉద్యోగుల సర్వీస్ బెనిఫిట్స్ ను తగ్గించడంపై గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించింది. సమ్మె ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. Salariess రికవరీ అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు జనవరి 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.
undefined
ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. అయితే జనవరి 17వ తేదీ రాత్రి పీఆర్సీపై ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయమై గెజిటెడ్ ఉద్యోగుల జెఎసీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇప్పటికే రెండు దఫాలు విచారణ నిర్వహించిన హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందించాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దఫాలు ఉద్యోగులను చర్చలకు పిలిచింది. అయితే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు హాజరౌతామని చెప్పారు.ఫిబ్రవరి 7వ తేదీ వరకు పలు రకాల ఆందోళనలను ఉద్యోగ సంఘాలు నిర్వహించనున్నాయి. తమ ఆందోళనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు.. అప్పటికి కూడా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే సమ్మెలోకి వెళ్లనున్నారు.