AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడగింపు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎప్పటివరకంటే..

By Sumanth KanukulaFirst Published Feb 1, 2022, 2:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ (andhra pradesh night curfew) పొడగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
 

ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పొడగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొగించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. తొలుత ప్రభుత్వం జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువు ముగియడంతో ప్రభుత్వం.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దానిని పొడగించాలనే నిర్ణయానికి వచ్చింది. 

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అయితే అత్యవసర సేవలు, ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, మందుల షాపులు, మీడియా ప్రతినిధులకు.. నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. 

ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్స్, ఫార్మసీ రంగాలు, మీడియా, పెట్రోల్‌ బంకులు, విద్యుత్ సిబ్బంది, నీటి సరఫరా, పారిశుద్ద్య సిబ్బంది, ఐటీ, ఐటీ సంబంధిత సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందికి కూడా మినహాయింపు కల్పించారు. అయితే విధి నిర్వహణలో ఉన్నవారు ఐడీ కార్డును చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించేవారు తగిన ఆధారాలు చూపడం ద్వారా వారు గమ్యస్థానాలు చేరుకునే వీలు కల్పించారు. 

ఇక, ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 25,284 నమూనాలను పరీక్షించగా... 5,879 మందికి వైరస్ పాజిటివ్ (Cases in AP)గా నిర్ధారణ అయింది. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 22,76,370కు చేరింది.  అదే సమయంలో 11,384 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,51,238కు చేరింది. రాష్ట్రంలో 11,0517 యాక్టివ్ కేసులు  (Corona active cases) ఉన్నాయి. గ‌డిచిన 24 గంటల స‌మయంలో  9 మంది మరణించారు. ఈ తాజా మర‌ణాల‌తో కరోనా మృతుల సంఖ్య సంఖ్య 14,615కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,51,238 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,10,517 మందికి చికిత్స కొనసాగుతోంది.

click me!