జడ్జి నివాసం లేదా కోర్టు హాల్ నుండి కోర్టులు పనిచేస్తాయని ఏపీ హైకోర్టు ప్రకటించింది.
అమరావతి: జడ్జి నివాసం లేదా కోర్టు హాల్ నుండి కోర్టులు పనిచేస్తాయని ఏపీ హైకోర్టు ప్రకటించింది. కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు గురువారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు అనుమతి ఉంటే తప్ప కేసులను ఫైనల్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టుతో పాటు హైకోర్టు పరిధిలోని అన్ని కార్యాలయాలు ఇలానే పనిచేస్తాయని హైకోర్టు ప్రకటించింది. కేసుల విచారణ సమయంలో భౌతిక దూరం పాటించాలని హైకోర్టు ఆదేశించింది.కరోనాతో ఇప్పటికే హైకోర్టుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మరణించారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో న్యాయమూర్తులు సోమవారం నాడు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
also read:కరోనా కల్లోలం: కోవిడ్ తో ఏపీహైకోర్టులో ఇద్దరు ఉద్యోగుల మృతి
కేసుల దాఖలు, విచారణ విధానంపై ఈ సమావేశంలో చర్చించారు. మరో వైపు వారం రోజుల పాటు బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని కూడ మూసివేస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు తీసుకొన్న నిర్ణయాలు మరింతగా కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలను పలువురు న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు.