ఎందుకు విచారణ జరగలేదు: ఎస్ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Feb 1, 2021, 4:55 PM IST
Highlights

ఎన్నికల కార్యదర్శి మార్పు విషయంలో చర్యలపై వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు.
చర్యలు తీసుకోకపోతే అప్పటి సీఎస్ నీలం సహానీని ఈ నెల 15వ తేదీన కోర్టుకు రావాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

అమరావతి: ఎన్నికల కార్యదర్శి మార్పు విషయంలో చర్యలపై వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు.
చర్యలు తీసుకోకపోతే అప్పటి సీఎస్ నీలం సహానీని ఈ నెల 15వ తేదీన కోర్టుకు రావాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన ఈ విషయమై ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 29వ తేదీవరకు కేసు ఎందుకు లిస్టు కాలేదనే విషయమై హైకోర్టు ఆరా తీసింది.

విచారణ చేసి ఈ నెల 15వ తేదీలోపుగా రిపోర్టు ఇవ్వాలని రిజిస్టర్ ను కోరింది. పిటిషన్ లిస్ట్ తర్వాత 42 రోజుల తర్వాత విచారణకు వస్తే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఎస్ఈసీని కోర్టు ప్రశ్నించింది. విచారణకు పిటిషన్ రాకపోయినా ఫర్లేదని సైలెంట్ గా ఉన్నారా అని కోర్టు ప్రశ్నించింది.

ఈ విషయమై ఎందుకు వినతిపత్రం సమర్పించలేదని కోర్టు అడిగింది. అనేక పిటిషన్ల కారణంగా గుర్తించలేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఎస్ఈసీ తరపున ఎస్ఈసీ కార్యదర్శి పిటిషన్, అఫిడవిట్లు వేయాల్సిన ఉన్నా ఎన్నికల సంఘం కమిషనర్ ఎందుకు పిటిషన్ వేస్తున్నాడని కోర్టు ప్రశ్నించింది. 

ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కార్యదర్శి అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి ఎస్ఈసీ తరపు న్యాయవాది తెచ్చారు.

click me!