ప్రభుత్వ సలహదారుల నియామకంలో రాజ్యాంగబద్దతను తేలుస్తాం: ఏపీ హైకోర్టు

By narsimha lodeFirst Published Feb 2, 2023, 10:05 PM IST
Highlights


ప్రభుత్వ సలహదారుల  నియామకంపై రాజ్యాంగబద్దతను తేల్చుతామని ఏపీ హైకోర్టు తెలిపింది.  సలహదారుల నియామకంపై దాఖలైన పిటిషన్లపై  ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిచ్వహించింది.  
 


అమరావతి:ప్రభుత్వ సలహాదారుల నియామకం పై రాజ్యాంగ బద్దతను తేల్చుతామన్న  ఏపీ హైకోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల పై దాఖలైన పిటీషన్ లను  గురవారం నాడు  హైకోర్టు విచారించింది. ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ సలహాదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతే  పరిమితి ఏముంటుందని  హైకోర్టు ప్రశ్నించింది.బయటినుంచి నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో జవాబుదారీతనం ఏముంటుంని హైకోర్టు అడిగింది. సలహదారుల నియామాకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయబోమని  రాజ్యాంగబద్దతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు తేల్చి చెప్పంది.

సలహదారులకు  ప్రత్యేకమైన నియామవళి లేనందున   సున్నితమైన సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందని  హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి  వాయిదా వేసింది  ఏపీ హైకోర్టు.దేవాదాయశాఖకు  సహదారుల నియమాకం విషయరమై  తీర్పును  హైకోర్టు ఇటీవల సవరించిన విషయం తెలిసిందే. ఐఎఎస్ అధికారులున్నా కూడా  ఎందుకు  సలహదారులను నియమించుకుంటున్నారని  కూడా  గతంలో  హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
 

click me!