జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు: ఎంపీ సురేష్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published May 26, 2020, 5:59 PM IST
Highlights

సోషల్ మీడియాలో హైకోర్టు జడ్జిలను కించ పరుస్తూ పోస్టులు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. హైకోర్టు జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన 49 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

అమరావతి: సోషల్ మీడియాలో హైకోర్టు జడ్జిలను కించ పరుస్తూ పోస్టులు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. హైకోర్టు జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన 49 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

గత వారంలో ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు నిర్ణయాలపై కీలక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో వైసీపీకి చెందిన నేతలు హైకోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేశారు.

also read:సుప్రీంలో ఎల్జీ పాలీమర్స్‌కు చుక్కెదురు: హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోం

విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ పై దాడి కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. గ్రామ పంచాయితీలపై రంగులకు సంబంధించిన జీవో 623ను రద్దు చేసింది హైకోర్టు. మరో వైపు ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేసింది. అతడిని విధుల్లోకి తీసుకోవాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో డాక్టర్ సుధాకర్ పై దాడి కేసులను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు తీర్పులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడ పోస్టులు చేశారు. ఈ పోస్టుల విషయమై సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. 

also read:జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ: ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత

ఈ లేఖ ఆధారంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొంది. హైకోర్టు తీర్పులపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లు కూడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు.

ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు 49 మందికి హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

click me!