ఆనందయ్య కంటిమందుకు ప్రభుత్వం షాక్: ఆర్డర్స్ ను రిజర్వ్ చేసిన హైకోర్టు

By Arun Kumar PFirst Published Jun 3, 2021, 2:47 PM IST
Highlights

కంటిలో వేసే మందుకు అనుమతుల కోసం ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించగా... ఈ పిటిషన్ పై ఇవాళ(గురువారం) న్యాయస్థానం విచారణ జరిపింది. 

అమరావతి: తాను కరోనా రోగులకు అందించే అన్ని మందులకు అనుమతించినట్లే కంటిలో వేసే మందుకు అనుమతుల కోసం ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ పై ఇవాళ(గురువారం) న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆ మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చింది. ఈ కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇరువర్గాల వాదన విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. 

ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ ప్రభుత్వం గత సోమవారమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు మినహా ఆనందయ్య  తయారు చేసే మూడు రకాల మందులను పంపిణీ కి మాత్రమే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇచ్చిన అనుమతి మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

read more  కంట్లో వేసే చుక్కల మందుపై ఆనందయ్య అభ్యర్థన: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్

అయితే ఆనందయ్య ఇచ్చే కళ్లలో వేసే మందుకు సంబంధించి ఇంకా  పూర్తి స్థాయి పరిశోధన రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ రిపోర్టులు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కంట్లో చుక్కల మందుపై తమకు రెండు వారాల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కంట్లో వేసే మందుపై నివేదికను గురువారంలోగా తెప్పిచుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణను గురువారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. 

ఇవాళ(గురువారం) తిరిగి విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనను వింటోంది. ఇప్పటికే ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం లంచ్ తర్వాత తిరిగి ఆనందయ్య, ప్రజాప్రయోజనాల తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. 

click me!