అనంతలో టీడీపీ మహిళా నేతల ఇంట్లో సోదాలు: హైకోర్టు ఎదుట హాజరైన ఎస్పీ

By Siva KodatiFirst Published Dec 21, 2021, 4:11 PM IST
Highlights

టీడీపీ (tdp) నేతల ఇంట్లో సోదాలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టు (ap high court) విచారణ జరిపింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్.పి  (anantapuram sp) ఫక్కీరప్ప కోర్టు ఎదుట హాజరయ్యారు. రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. 

టీడీపీ (tdp) నేతల ఇంట్లో సోదాలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టు (ap high court) విచారణ జరిపింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్.పి  (anantapuram sp) ఫక్కీరప్ప కోర్టు ఎదుట హాజరయ్యారు. రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. కాగా... ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులపై మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం పోలీసులు మహిళా టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ కేసులో, పిటిషనర్లైన టీడీపీ మహిళా నేతలు నలుగురికీ హైకోర్టు నాలుగు రోజుల క్రితం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. పిటిషనర్లపై ఉన్న ఆరోపణలు ఏమిటి? వారి ఇళ్లలో సోదాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీని ఆదేశించింది.  పిటిషనర్ల తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పోలీసులు పిటిషనర్ల ఇళ్లలోని వంటగదుల్లోకి వెళ్లి సోదాలు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారంపై కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని అనంతపురం ఎస్పీని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్పీ ఫక్కీరప్ప ధర్మాసనం ఎదుట విచారణకు హాజరయ్యారు. 

click me!