గుంటూరు: విద్యార్థిణితో అసభ్య ప్రవర్తన... టీచర్ ను చితకబాదిన గ్రామస్తులు

Arun Kumar P   | Asianet News
Published : Sep 07, 2021, 05:19 PM ISTUpdated : Sep 07, 2021, 05:27 PM IST
గుంటూరు: విద్యార్థిణితో అసభ్య ప్రవర్తన... టీచర్ ను చితకబాదిన గ్రామస్తులు

సారాంశం

విద్యార్థిణితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయున్ని గ్రామస్తులు చితకబాదిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: విద్యార్థిణితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రభుత్వోపాధ్యాయుడిపై గ్రామస్తులు అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. 

వీడియో

తనతో స్కూల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడని వట్టిచెరుకూరు జెడ్పీ స్కూల్లో చదివే విద్యార్థిణి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు బంధువులు, ఊరివాళ్లతో కలిసి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠం చెబుతున్న టీచర్ ను బయటకు లాగి చితకబాదారు.  ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన మిగతా టీచర్లపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. అయితే తాను తప్పుగా ప్రవర్తించలేదని... చదువు విషయంలో మందలించానని సదరు టీచర్ చెబుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్