YS Vivekanada Reddy Murder Case: పులివెందుల కోర్టు నుండి కడప కోర్టుకు కేసు బదిలీ

Published : Feb 22, 2022, 01:54 PM ISTUpdated : Feb 22, 2022, 02:19 PM IST
YS Vivekanada Reddy Murder Case: పులివెందుల కోర్టు నుండి కడప కోర్టుకు కేసు బదిలీ

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కడప కోర్టు చేపట్టనుంది. ఇప్పటివరకు ఈ కేసును పులివెందుల కోర్టు నిర్వహించింది.

కడప: మాజీ మంత్రి YS Vivekanada Reddyహత్య కేసు విచారణను Pulivendula కోర్టు నుండి Kadapa కోర్టుకు బదిలీ అయింది. ఇప్పటివరకు ఈ కేసు విచారణను పులివెందుల కోర్టు నిర్వహిస్తోంది. అయితే ఇవాళ ఈ కేసును కడప కోర్టుకు బదిలీ చేశారని సమాచారం.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు మంగళవారం నాడు హాజరు పర్చారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి లను ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అనారోగ్య కారణాలతో కోర్టులో హాజరుపర్చలేదు.

2019 మార్చి మాసంలో వైఎస్ వివేకానందరెడ్డిని స్వగృహంలోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసు విచారణను  సీబీఐ చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అప్రూవర్ గా మారుతున్నట్టు దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.  దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. 

 వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను  దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని Umashankar Reddy   తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి  ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu