జగన్‌కు ఎదురుదెబ్బ: 3 రాజధానులు, సీఆర్డీఏపై హైకోర్టు కీలక తీర్పు

Published : Mar 03, 2022, 10:54 AM ISTUpdated : Mar 03, 2022, 03:20 PM IST
జగన్‌కు ఎదురుదెబ్బ: 3 రాజధానులు, సీఆర్డీఏపై హైకోర్టు కీలక తీర్పు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని.. 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది.

అభివృద్ది పనులపై హైకోర్టుకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని పేర్కొంది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమిని వినియోగించడానికి వీల్లేదని తెలిపింది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

కొందరు న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని తెలిపింది. మాస్టర్ ప్లాన్ ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?