మెగా సోలార్ ప్రాజెక్ట్... హైకోర్టులో ఏపీ సర్కార్‌కు ఊరట

By Siva KodatiFirst Published Jul 20, 2021, 8:15 PM IST
Highlights

మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జారీ చేసిన ఆదేశాలను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. కేసు ముగిసేవరకు టెండర్లు ఫైనల్ చేయొద్దని డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెగా సోలార్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జారీ చేసిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. అంతకుముందు టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని, ఫైనల్ చేయొద్దని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై మంగళవారం విచారణ జరిపిన  డివిజన్ బెంచ్.. టెండర్లు రద్దు చేయాలన్న ఆదేశాలను సింగిల్ బెంచ్ ఆదేశాలను సస్పెండ్ చేసింది. కేసు ముగిసేవరకు టెండర్లు ఫైనల్ చేయొద్దని డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది హైకోర్ట్ . కాగా, 400 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను వ్యవసాయానికి ఇవ్వడానికి గతేడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.

click me!