చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ సీఐడీకి చుక్కెదురైంది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు మధ్యంతర బెయిల్ సమయంలో ఇచ్చిన షరతులకు అదనపు షరతులు జోడించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు డిస్పోజ్ చేసింది.
ఐదు షరతులతో చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది అక్టోబర్ 31న ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు విధించిన ఐదు షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించి ఇవాళ తీర్పును వెల్లడించింది.
undefined
రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని ఏపీ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. స్కిల్ కేసులోని అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కూడ కోర్టు తేల్చి చెప్పింది.ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు విన్పించారు.
రాజమండ్రి జైలు నుండి చంద్రబాబు విజయవాడకు రావడానికి 14 గంటల సమయం పట్టిన విషయాన్ని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు కారు దిగలేదని గుర్తు చేశారు. చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చిన సమయంలో ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు వచ్చారని సీఐడీ వాదనను కౌంటర్ చేశారు చంద్రబాబు న్యాయవాది.
రాజమండ్రి జైలు నుండి విడుదలైన సమయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. తప్పు చేయను.. చేయనివ్వనని చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని దమ్మాల పాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది.ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబునాయుడిని ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చే సమయంలో మరో ఐదు షరతులను జత చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది.