చంద్రబాబుపై మరో కేసు నమోదు

Published : Nov 03, 2023, 07:23 AM ISTUpdated : Nov 03, 2023, 08:47 AM IST
చంద్రబాబుపై మరో కేసు నమోదు

సారాంశం

మధ్యంతర బెయిలుపై బైటికి వచ్చిన చంద్రబాబు నాయుడును కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసులో టీడీపీ నేత పీతల సుజాతను కూడా చేర్చింది. 

అమరావతి : చంద్రబాబునాయుడుపై పెడుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కేసు నమోదయ్యింది.  ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పీతల సుజాత హాయాంలో ఇసుక అక్రమాలు జరిగాయాని దీంతో.. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూరిందని మైనింగ్ శాఖ ఫిర్యాదు చేసింది.
ఏపీఎండీసీ చేసిన ఈ ఫిర్యాదుతో సిఐడి చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది.

ఉచిత ఇసుక విధానం పేరుతో ఇసుక దోపిడీ జరిగిందని మైనింగ్ శాఖ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం లేకుండా ప్రత్యేక మెమో తో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో టీడీపీ హయాంలో గనుల శాఖా మంత్రిగా ఉన్న పీతల సుజాతను ఏ1గా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏ2గా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏ3గా చేర్చింది. 

2016నుంచి 2019వరకు టీడీపీ హయాంలో జలవనరుల శాఖా మంత్రిగా ఉన్న దేవినేని ఉమాను ఈ కేసులో ఏ4గా చేర్చింది. వీరితో పాటు మరికొందరిని ఏ5గా పేర్కొంటూ ఏపీఎండీసీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి తెలుపుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్