ఒక్క ఉచిత బోరు వేయించారా: చంద్రబాబుపై బొత్స ఫైర్

Siva Kodati |  
Published : Sep 30, 2020, 02:53 PM IST
ఒక్క ఉచిత బోరు వేయించారా: చంద్రబాబుపై బొత్స ఫైర్

సారాంశం

చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క ఉచిత బోరు వేయించారా అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ప్రశంసించారు

చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క ఉచిత బోరు వేయించారా అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ప్రశంసించారు.

బీసీల అభ్యున్నతికి 56 బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని బొత్స వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు ఎన్టీఆర్ అండగా నిలిచారని ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి గుర్తుచేశారు.

చంద్రబాబు హయాంలో బీసీలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని బొత్స ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడిన అక్కాచెల్లెళ్ల కోసం ఆసరా, చేయూత వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు నాయుడు దోచుకుతిన్నారని ఆయన ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?