విశాఖలో రీతీసాహా కేసు: సీసీటీవీ పుటేజీ సేకరణ, విచారణ ఈ నెల 27కి వాయిదా

By narsimha lode  |  First Published Sep 1, 2023, 2:00 PM IST

విశాఖపట్టణంలో  మృతి చెందిన బెంగాల్ టీనేజర్ రీతీసాహా కేసు విచారణను  ఏపీ హైకోర్టు ఈ నెల  27వ తేదీకి వాయిదా వేసింది. సీసీటీవీ పుటేజీపై  రీతీసాహా తండ్రి కోర్టును ఆశ్రయించారు.


అమరావతి: విశాఖపట్టణంలో  మృతి చెందిన  బెంగాల్ టీనేజర్ రీతీసాహా కేసులో   ఆమె తండ్రి సుఖ్‌దేవ్  ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను ఈ నెల  27వ తేదీకి  ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

రీతీసాహా మృతిపై అనుమానంతో  ఆమె తండ్రి సుఖ్ దేవ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీసీటీవీ విషయమై  హైకోర్టును ఆశ్రయించారు. సీసీటీవీని ధ్వంసం చేసే ప్రమాదం ఉందని  ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అడ్వకేట్ కమిషన్ ను  ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసింది.  రీతీసాహ ఉన్న  హస్టల్ భవనానికి చెందిన  సీసీటీవీ పుటేజీని  ఈ ఏడాది జూలై  1 నుండి  14వ తేదీ వరకు సమర్పించాలని  కోరారు. అదే విధంగా  రీతీసాహాకు  వైద్య చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రిలో జూలై  14, 15 తేదీలకు చెందిన సీసీటీవీ పుటేజీని కోరారు. ఈ సీసీటీవీ పుటేజీని అడ్వకేట్ కమిషనర్ సేకరించారు. హైకోర్టుకు  సమర్పించారు. ఈ కేసు విచారణను ఈ నెల  27వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

Latest Videos

undefined

also read:విశాఖలో టీనేజర్ రీతీసాహా మృతి కేసులో మరో ట్విస్ట్: ఐపీసీ 302 కింద కేసు నమోదు

ఈ ఏడాది జూలై  14న  బెంగాల్ రాష్ట్రానికి చెందిన  టీనేజర్  రీతీసాహా  తాను నివాసం ఉంటున్న హస్టల్ భవనంపై నుండి  కింద పడి మృతి చెందింది.రీతీసాహా మృతిపై  విశాఖపట్టణం నాలుగో పట్టణ పోలీసులు  174 సెక్షన్ కింద  కేసు నమోదు చేశారు. రీతీసాహా మృతిపై  ఆమె పేరేంట్స్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.  దీంతో  బెంగాల్ సీఎం మమత బెనర్జీకి రీతీసాహా తండ్రి సుఖ్‌దేవ్ ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా కోల్‌కత్తా నేతాజీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  బెంగాల్ పోలీసులు రీతీసాహా  మృతి కేసును విచారిస్తున్నారు.   రీతీసాహ మృతిపై  ఐపీసీ 302 సెక్షన్ కింద  బెంగాల్ పోలీసులు  నిన్న కేసు నమోదు చేశారు.ఈ కేసులో  విశాఖపట్టణం నాలుగో పట్టణ సీఐ శ్రీనివాసరావును  సీపీ త్రివిక్రమ్ వర్మ సరెండర్ చేశారు.

click me!