అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

Google News Follow Us

సారాంశం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల  27కి వాయిదా వేసింది. 

హైదరాబాద్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను  ఏపీ హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల  21న  ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. అయితే  ఈ విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.  ఇవాళ  మధ్యాహ్నం ఏపీ హైకోర్టులో  చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా  వాదనలు వినిపించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు బనాయించారని  ఆయన తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా వాదించారు. 

మరో వైపు  ఏసీబీకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  పిటీ వారంట్ పెండింగ్ లో ఉన్నందున  బెయిల్ ఇవ్వవద్దని  సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు.ఇవాళ విచారణ ప్రారంభం కాగానే ఈ విషయమై  చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు . ఏసీబీ కోర్టులో పీటీ వారంట్, కస్టడీ పిటిషన్ కూడ  పెండింగ్ లో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని  సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. 

సుమారు గంటన్నరపాటు సిద్దార్ధ్ లూథ్రా ఏపీ హైకోర్టు ముందు వాదించారు.ఇన్నర్ రింగు రోడ్డు ఫైనల్ అలైన్‌మెంట్ జరిగి ఆరేళ్లవుతోందన్నారు. అయితే ఇంతవరకు  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదో చెప్పాలన్నారు. 

also read:చంద్రబాబు అరెస్టైతే లోకేష్ బిత్తర చూపులు: కొడాలి నాని సెటైర్లు

చంద్రబాబు తరపు వాదనలు పూర్తైన తర్వాత ఏజీ శ్రీరామ్ వాదనలు విన్పించారు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రజల కోసం కాదని వాదించారు. చంద్రబాబు తన అనుయాయుల కోసమే  ఇన్నర్ రింగ్ రోడ్డును తీసుకు వచ్చారని వాదించారు.ఇవాళ  సమయం మించిపోవడంతో ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.రేపు మధ్యాహ్నం  2:15 గంటలకు ఈ పిటిషన్ పై విచారణను నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. రేపు మధ్యాహ్నం ఏజీ శ్రీరామ్ ప్రభుత్వం తరపు వాదనలు విన్పించనున్నారు.