బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే.. కుటుంబ సభ్యులు ఏమయ్యారు : మంత్రి విడదల రజనీ

Siva Kodati |  
Published : Sep 25, 2022, 02:31 PM IST
బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే.. కుటుంబ సభ్యులు ఏమయ్యారు : మంత్రి విడదల రజనీ

సారాంశం

వైఎస్సార్ వైద్య రంగంలో అనేక సేవలు చేశారు కాబట్టే హెల్త్ యూనివర్సిటీ కి పేరు మార్చామని మంత్రి విడదల రజనీ తెలిపారు. చంద్రబాబు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఆయన పదవి లాక్కొని, మానసిక క్షోభ పెట్టింది చంద్రబాబు కదా అని రజనీ ప్రశ్నించారు.   

చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత ద్వారా 25 కోట్లు పంపిణీ చేసామన్నారు మంత్రి విడదల రజినీ. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలను చెప్పిన మాట చెప్పినట్టు సీఎం అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ఎన్టీఆర్ పదవి లాక్కొని, మానసిక క్షోభ పెట్టింది చంద్రబాబు కదా అని రజనీ ప్రశ్నించారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు అని తెలుగు ప్రజలకు తెలుసునని.. వైఎస్సార్ వైద్య రంగంలో అనేక సేవలు చేశారు కాబట్టే హెల్త్ యూనివర్సిటీ కి పేరు మార్చామని మంత్రి తెలిపారు. 

వైఎస్సార్, జగన్ ఇరవై మెడికల్ కాలేజ్ లు తెచ్చారు కాబట్టే పేరు మార్చామన్నారు. అసెంబ్లీ వేదికగా ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం సీఎం జగన్ తెలియజేసారని విడదల రజనీ అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానం ఉంది కాబట్టే ఎన్టీఆర్ జిల్లా తెచ్చామని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినప్పుడు కుటుంబ సభ్యులు ఏమయ్యారని ఆమె నిలదీశారు. 

ALso REad:ప్లూటు బాబు ముందు ఊదు జ‌గ‌నన్న ముందు కాదు... తేడాలోస్తే దబిడి దిబిడే: బాలయ్యకు రోజా కౌంటర్

కాగా...  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ జగన్ సర్కార్ తీసుుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. స్వయంగా డాక్టర్ అవడమే కాదు సీఎంగా రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు కృషిచేసిన దివంగత వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం కరెక్టేనని అధికార వైసిపి సమర్దించుకుంటుంటే... మహనీయుడు ఎన్టీఆర్ పేరును తొలగించడమేంటని ప్రతిపక్ష టిడిపి తప్పుబడుతోంది. ఈ విషయమై వైసిపి, టిడిపి నాయకులకు మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 

హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి పేరు తొలగించడంపై  ఎన్టీఆర్ తనయుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించగా తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటరిచ్చారు. బాలకృష్ణ డైలాగ్ నే వాడుతూ ఆయనకే సెటైర్లు వేసారు మంత్రి. ''బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం... తేడా వస్తే దబిడి దిబిడే..!!'' అంటూ బాలకృష్ణకు రోజా కౌంటరిచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్