కొత్తగా 54 మందికి పాజిటివ్.. విశాఖలో అత్యధికం: ఏపీలో 8,88,814కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Feb 13, 2021, 08:03 PM IST
కొత్తగా 54 మందికి పాజిటివ్.. విశాఖలో అత్యధికం: ఏపీలో 8,88,814కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కోవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదవుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,88,814కి చేరుకుంది. 

కోరోనా కారణంగా నిన్న రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోదు. ఇప్పటి వరకు ఏపీలో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 7,162కి చేరింది. గడిచిన 24 గంటల్లో 71 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,80,855కి చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 797 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న 33,415 మందికి కరోనా టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ నిర్థారణా పరీక్షల సంఖ్య 1,35,17,440కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 0, చిత్తూరు 7, తూర్పుగోదావరి 7, గుంటూరు 5, కడప 6, కృష్ణ 8, కర్నూలు 0, నెల్లూరు 5, ప్రకాశం 0, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 9, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu