తెలంగాణ తాత్కాలిక ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్... అమరావతిలో ఆ సదుపాయం కట్

By Siva KodatiFirst Published Sep 23, 2021, 6:02 PM IST
Highlights

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి సౌకర్యం కట్ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు వచ్చే నెల నుంచి ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి సౌకర్యం కట్ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు వచ్చే నెల నుంచి ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులు సొంత ఖర్చులతో వసతి భరించాలని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 31 వరకు మాత్రమే ఉద్యోగులకు ఉచిత రవాణా వసతి కల్పించనుంది. ఇప్పటివరకు షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించింది.  కాగా రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌‌లో ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా వీరంతా పని చేశారు. విభజన తర్వాత అమరావతికి మారారు. అప్పటి నుంచి వారికి ప్రభుత్వమే ఉచిత ట్రాన్సిట్ వసతి కల్పించింది. తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వీరందరికి షాక్ తగిలినట్టైంది.

click me!