ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్..

Published : Jun 24, 2023, 04:57 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోంది. తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Also Read: కన్నీళ్లు వస్తున్నాయి..అందుకే ఇక్కడ అడుక్కుంటున్నాను: వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా

కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్‌లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటుఅవుతాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిలో రిజిస్టార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వులలో పేర్కొంది. గ్రామ సచివాలయాల పరిధిని కూడా ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. 1908, సెక్షన్ 5 ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న గ్రామాలు, ప్రాంతాలు కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu