నిరుద్యోగులకు శుభవార్త : ఏపీలో మెగా డీఎస్సీ 2024 విడుదల , 6100 పోస్టులు .. దరఖాస్తు ఎలా..?

By Siva Kodati  |  First Published Feb 7, 2024, 3:48 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024 విడుదల చేసింది. మొత్తం 6100 టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామని నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు.  వీటిలో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్‌జీటీ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు వున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దీనిలో భాగంగా బుధవారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6100 టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామని నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

ఏడు మేనేజ్‌మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని ప్రకటిస్తున్నామని.. వీటిలో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్‌జీటీ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు వున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమవుతుండగా.. ఏప్రిల్ 7వ తేదీన ముగుస్తుందని బొత్స తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని.. గడిచిన ఐదేళ్లలో రూ.73 వేల కోట్లను విద్యపై ఖర్చు చేశామని మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో వున్న ఏపీ అభ్యర్ధుల కోసం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

Latest Videos

ఏపీ డీఎస్సీ ముఖ్యమైన తేదీలు :

  • ఫిబ్రవరి 12 : దరఖాస్తుల స్వీకరణ
  • మార్చి 5 : హాల్ టికెట్ల డౌన్‌లోడ్
  • మార్చి 31 : ప్రాథమిక కీ విడుదల
  • ఏప్రిల్ 1 :  కీ పై అభ్యంతరాల స్వీకరణ
  • ఏప్రిల్ 2 : ఫైనల్ కీ విడుదల
  • ఏప్రిల్ 7 : డీఎస్సీ ఫలితాలు విడుదల
click me!