ఏపీలో కొత్తగా 2,526 మందికి పాజిటివ్.. 19,29,210కి చేరిన కేసులు, గోదావరి జిల్లాల్లో తీవ్రత

Siva Kodati |  
Published : Jul 15, 2021, 06:56 PM IST
ఏపీలో కొత్తగా 2,526 మందికి పాజిటివ్.. 19,29,210కి చేరిన కేసులు, గోదావరి జిల్లాల్లో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదవ్వగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,933 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 25,526 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,526 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,29,210కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,081కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 1, చిత్తూరు 4, ప్రకాశం 6, శ్రీకాకుళం2, అనంతపురం 1 , కృష్ణ 5, నెల్లూరు 2, గుంటూరు 2, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరిలలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,933 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,90,603కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 93,785 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,33,14,697కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 25,526 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 80, చిత్తూరు 301, తూర్పుగోదావరి 404, గుంటూరు 178, కడప 157, కృష్ణ 269, కర్నూలు 35, నెల్లూరు 210, ప్రకాశం 308, శ్రీకాకుళం 91, విశాఖపట్నం 119, విజయనగరం 49, పశ్చిమ గోదావరిలలో 235 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu