పీవీ సింధుకు విశాఖ‌లో రెండెకరాల భూమి.. ఏపీ సర్కార్ ఆదేశాలు

By Siva KodatiFirst Published Jun 17, 2021, 9:30 PM IST
Highlights

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో రెండు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించింది ఏపీ ప్ర‌భుత్వం. విశాఖ రూర‌ల్ చినగ‌దిలి గ్రామంలో భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో రెండు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించింది ఏపీ ప్ర‌భుత్వం. విశాఖ రూర‌ల్ చినగ‌దిలి గ్రామంలో భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింధుకు కేటాయించిన భూమిని ప‌శు సంవ‌ర్ధ‌కశాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్త‌ర్వులు వెలువ‌రిచింది.

Also Read:రిటైర్మెంట్ పోస్టుపై స్పందించిన పీవీ సింధు... పూర్తిగా చదవకుండా గోల చేశారంటూ...

భూమిని ఉచితంగా ఇస్తున్న‌ట్టు సర్కారు ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. కాగా, అకాడ‌మీని రెండు ఫేజుల్లో నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వానికి తెలిపారు పీవీ సింధు.. ఒక్కో దశలో రూ. 5 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే ఆ భూమి ఉప‌యోగించాల‌ని.. వాణిజ్య అవ‌స‌రాల‌కోసం వినియోగించకూడదని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది ప్రభుత్వం. ఈ అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభావంతులైన పేద‌ యువతీ, యువకులకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

click me!