సమగ్ర భూసర్వే: స్టీరింగ్ కమిటీని నియమించిన ఏపీ సర్కార్.. సీఎం సలహాదారు నేతృత్వం

By Siva KodatiFirst Published Jun 17, 2021, 7:08 PM IST
Highlights

రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కోసం స్టీరింగ్ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సీఎం ప్రధాన సలహాదారు సారథ్యంలో కమిటీ పనిచేయనుంది. ఈ స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, ఆర్థిక, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు

రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కోసం స్టీరింగ్ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సీఎం ప్రధాన సలహాదారు సారథ్యంలో కమిటీ పనిచేయనుంది. ఈ స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, ఆర్థిక, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ల సారథ్యంలో జిల్లా స్థాయి రీసర్వే ప్రాజెక్టు అమలు కమిటీని నియమించారు.  డ్రోన్లు, కార్స్ ద్వారా ప్రభుత్వం భూముల రీసర్వే ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. 

Also Read:ఈ నెల 21 నుండి భూముల సర్వే: ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కాగా, పైలట్‌ ప్రాజెక్టు కింద గ్రామాల్లో చేపట్టిన రీసర్వే పూర్తి కావచ్చింది. తొలిదశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి చేసి, ముసాయిదాను ముద్రిస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. భూముల రీ సర్వే కోసం ఇప్పటికే రాష్ట్రంలో 70 బేస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని... సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో మరికొన్ని గ్రౌండ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

click me!