నిమ్మగడ్డకు షాక్: ఇంటి అద్దె అలవెన్స్ మీద విచారణకు గవర్నర్ ఆదేశం

By Siva KodatiFirst Published Feb 12, 2021, 3:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ షాకిచ్చారు. ఎస్ఈసీ హోదాలో వున్న ఆయన రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్‌ పొందుతున్నట్టుగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్‌ కార్యాలయం ఆదేశించింది

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ షాకిచ్చారు. ఎస్ఈసీ హోదాలో వున్న ఆయన రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్‌ పొందుతున్నట్టుగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్‌ కార్యాలయం ఆదేశించింది.

ఈ మేరకు యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ క్యాంపెయిన్‌ (యూఎఫ్‌ఆర్‌టీఐ) ప్రతినిధులు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తమకు గవర్నర్‌ కార్యాలయం సమాచారం అందిందని వారు వెల్లడించారు.

కాగా, యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు నిమ్మగడ్డపై గత డిసెంబర్‌ 14న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, నస్రీన్‌బేగంలు తాజాగా గవర్నర్‌ కార్యాలయం నుంచి సమాచారం కోరారు.

దీనిపై స్పందించిన గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ బదులిస్తూ.. ఆ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్‌ 24న ఆదేశించినట్టు తెలిసినట్టు వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
 

click me!