
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన కొత్త మంత్రుల జాబితాకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhusan harichandan) ఆమోదం తెలిపారు. రేపు సచివాలయం ఆవరణలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. పాత మంత్రుల్లో 11 మంది మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సీఎం జగన్ సూచనతో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు గవర్నర్. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎంవో నుంచి ఆహ్వానాలు అందడంతో వారంతా ఒక్కొక్కరిగా విజయవాడకు చేరుకుంటున్నారు. ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు సాయంత్రమే విజయవాడ చేరుకున్న సంగతి తెలిసిందే.
అంతకుముందు కొత్త మంత్రివర్గంలో చివరి నిమిషంలో మార్పులు చేపట్టారు వైఎస్ జగన్. కేబినెట్‌లో తిప్పేస్వామికి (thippeswamy) చివరి నిమిషంలో చోటు దక్కలేదు. కొత్త కేబినెట్‌లో మళ్లీ ఆదిమూలపు సురేష్‌కు (adimulapu suresh) చోటు కల్పించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కొత్త మంత్రుల జాబితాను ఆదివారం విడుదల చేశారు. 25 మందితో కొత్త టీమ్‌ను సీఎం జగన్ ఎంపిక చేసుకొన్నారు. గత కేబినెట్ లో పనిచేసిన 10 మందిని AP Cabinet Reshuffle లో చోటు కల్పించారు. కొత్త వారిలో 15 మందికి చోటు కల్పించారు. సీనియారిటీతో పాటు పాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 10 మంది పాత వారికి కేబినెట్ లో చోటు కల్పించారు. దీనికి తోడు ఆయా జిల్లాల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కూడా పాతవారికి చోటు కల్పించారు.
ఏపీ సీఎం కొత్త టీమ్ ఇదే
1.ధర్మాన ప్రసాదరావు,
2.సీదిరి అప్పలరాజు
3.బొత్స సత్యనారాయణ
4.గుడివాడ అమర్ నాథ్
5.సి. రాజన్నదొర
6.తాడిశెట్టి రాజా
7.చెల్లుబోయిన వేణుగోపాల్
8.బూడి ముత్యాలనాయుడు
9.నారాయణస్వామి
10.ఉషశ్రీచరణ్
11.విశ్వరూప్
12.జోగి రమేష్
13.అంబటి రాంబాబు
14.మేరుగ నాగార్జున
15.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
16.పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి
17.కారుమూరి నాగేశ్వరరావు
18.కొట్టు సత్యనారాయణ
19.కళావతి
20.అంజద్ భాషా
21.తానేటి వనిత
22.గుమ్మనూరు జయరాం
23.తిప్పేస్వామి
24. ఆర్. కే. రోజా
25.కాకాని గోవర్ధన్ రెడ్డి