
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో అధికార వైసీపీలో (ysrcp) అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అధినేత మొండిచేయి ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తుది జాబితా వెలువడిన క్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల మద్ధతుదారులు రోడ్లెక్కారు. చిలకలూరిపేట, మాచర్ల, ఒంగోలు, జగ్గయ్యపేట, పెనమలూరు వంటి చోట్ల వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అటు సీఎంకు దగ్గరి బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) సైతం తమనకు మంత్రి పదవి దక్కకపోవడంతో అలకబూనారు. దీంతో జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) ఆదివారం మధ్యాహ్నం బాలినేని ఇంటికి వెళ్లి బుజ్జగించి వచ్చారు. అయితే సాయంత్రం మంత్రుల జాబితా ప్రకటించిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి మరింత అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది. ఒకానొక దశలో ఆయన రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో మరోసారి బాలినేని ఇంటికి వెళ్లారు సజ్జల.
కొత్త కేబినెట్‌లో చోటు దక్కలేదన్న అసంతృప్తితో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఉదయం నుంచీ విజయవాడలో ఇంటికే పరిమితమయ్యారు. కనీసం పార్టీ నాయకుల్ని, అనుచరుల్ని కూడా కలిసేందుకు బయటకు రాలేదు. బాలినేనికి చోటు దక్కలేదన్న సమాచారంతో ఆయన నివాసానికి పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. అంతేకాదు బాలినేని ఇంటివద్ద అనుచరులు ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం బాలినేని ఎంతో కృషి చేశారని చెబుతున్నారు. కొత్త కేబినెట్‌లోనూ ఆయనకు చోటివ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కొత్త మంత్రివర్గంలో చివరి నిమిషంలో మార్పులు చేపట్టారు వైఎస్ జగన్. కేబినెట్‌లో తిప్పేస్వామికి (thippeswamy) చివరి నిమిషంలో చోటు దక్కలేదు. కొత్త కేబినెట్‌లో మళ్లీ ఆదిమూలపు సురేష్‌కు (adimulapu suresh) చోటు కల్పించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కొత్త మంత్రుల జాబితాను ఆదివారం విడుదల చేశారు. 25 మందితో కొత్త టీమ్‌ను సీఎం జగన్ ఎంపిక చేసుకొన్నారు. గత కేబినెట్ లో పనిచేసిన 10 మందిని AP Cabinet Reshuffle లో చోటు కల్పించారు. కొత్త వారిలో 15 మందికి చోటు కల్పించారు. సీనియారిటీతో పాటు పాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 10 మంది పాత వారికి కేబినెట్ లో చోటు కల్పించారు. దీనికి తోడు ఆయా జిల్లాల సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కూడా పాతవారికి చోటు కల్పించారు.
ఏపీ సీఎం కొత్త టీమ్ ఇదే
1.ధర్మాన ప్రసాదరావు,
2.సీదిరి అప్పలరాజు
3.బొత్స సత్యనారాయణ
4.గుడివాడ అమర్ నాథ్
5.సి. రాజన్నదొర
6.తాడిశెట్టి రాజా
7.చెల్లుబోయిన వేణుగోపాల్
8.బూడి ముత్యాలనాయుడు
9.నారాయణస్వామి
10.ఉషశ్రీచరణ్
11.విశ్వరూప్
12.జోగి రమేష్
13.అంబటి రాంబాబు
14.మేరుగ నాగార్జున
15.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
16.పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి
17.కారుమూరి నాగేశ్వరరావు
18.కొట్టు సత్యనారాయణ
19.కళావతి
20.అంజద్ భాషా
21.తానేటి వనిత
22.గుమ్మనూరు జయరాం
23.తిప్పేస్వామి
24. ఆర్. కే. రోజా
25.కాకాని గోవర్ధన్ రెడ్డి