హైద్రాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తిరుమల ఎఎస్పీ మునిరామయ్యను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
తిరుపతి: తిరుమల ఎఎస్పీ మునిరామయ్యపై బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం బదిలీ వేటేసింది.హైద్రాబాద్ CCS లో మునిరామయ్యపై కేసు నమోదు కావడంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది.
Chittoor జిల్లా Tirumala అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఓ డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో Muni Ramaiah ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
undefined
ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ముని రామయ్యకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ వ్యవహారంపై Hyderabad పోలీసులు Andhra Pradesh అధికారులకు సమగ్ర నివేదిక సమర్పించారు.
మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు Sunil kumar విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడైన కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్‌లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు. దీంతో 2019 అక్టోబర్ 28న ముని రామయ్యను తీసుకుని జయ ప్రతాప్ హైదరాబాద్ లో సునీల్ కుమార్ ను కలిశారు.
అప్పట్లో ముని రామయ్య CID విభాగంలో తిరుపతి డీఎస్పీగా పని చేస్తున్నారు. సునీల్ కుమార్‌తో పెట్టుబడుల విషయం చెప్పాడు. రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ నమ్మబలికాడు. రూ.3 కోట్లకు ఆర్టీజీఎస్ ఫామ్ రూపొందించి తన ఫోన్ ద్వారా సునీల్‌కుమార్‌కు పంపాడు. దీంతో పాటు ఆర్కే క్లీన్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో రూ.3 కోట్లకు రాసిన చెక్కులు ఇచ్చాడు.
అయితే ఈ డబ్బులను మునిరామయ్య నుండి సునీల్ కుమార్ పొందలేదు.ఈ విషయమై మునిరామయ్యతో పాటు ప్రతాప్ నునీల్ పలుమార్లు అడిగాడు. అయినా డబ్బులు రాలేదు. ఓ భూమి పత్రాలను ముని రామయ్య ఇచ్చాడు. కానీ ఆ పత్రాలు పరిశీలించిన బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు.
దీంతో సునీల్ కుమార్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశార. జయప్రతాప్, మునిరామయ్య, కేవీ రాజు తదితరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు నిర్థారించారు. ఈ విషయమై హైద్రాబాద్ లో కేసు నమోదు కావడంతో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.