కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఫోకస్: రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్

By narsimha lode  |  First Published Jan 24, 2022, 9:24 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా మారనుంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త Districts ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో Notification జారీ చేసే అవకాశం ఉంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు YS Jagan హామీ ఇచ్చారు. ఈ విషయమై ప్రభుత్వం కేంద్రీకరించింది. 

రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించనున్నారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో  ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు గతంలోనే జీవోను జారీ చేసింది.

Latest Videos

కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Nilam Sawhney నేతృత్వంలో 2020 ఆగష్టు 9వ తేదీన అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

New జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ  ఈ కమిటి అధ్యయనం చేసింది.
2021 మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

కొత్త జిల్లాల విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు కూడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు.  మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడ కొత్త జిల్లాల విషయంలో గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి శూన్యంగా మారనుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని కోరారు. అదే జరిగితే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం దొరుకుతోందన్నారు.  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.

ప్రజల మనోభావాలు సున్నితమైనవి... అవి దెబ్బతినకుండా ప్రజల అభిప్రాయాల మేరకు జిల్లాల పునర్విభజన జరగాలని ఆయన కోరుకొన్నారు.

కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. వీటిపై మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. 

1) అరకు జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతాలు
130. కురుపాం 
131. పార్వతీపురం
132. సాలూరు
146. మాడుగుల,
147. అరకు లోయ 
148. పాడేరు
172. రంపచోడవరం 

2) శ్రీకాకుళం జిల్లా
120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.

3) విజయనగరం జిల్లా
126. ఎచ్చెర్ల,
128. రాజాం 
129. పాలకొండ హ
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.

4) విశాఖపట్నం జిల్లా
135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140.తూర్పు విశాఖపట్నం,
141. దక్షిణ విశాఖపట్నం,
142. ఉత్తర విశాఖపట్నం,
143. పశ్చిమ విశాఖపట్నం

5) అనకాపల్లి  జిల్లా
144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పయకరావుపేట
153. నర్సీపట్నం.

6) కాకినాడ జిల్లా
154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.

7) అమలాపురం జిల్లా 
161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం
164. రాజోలు
165. గన్నవరం
166. కొత్తపేట,
167. మండపేట

8) రాజమండ్రి జిల్లా
159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు
174. నిడదవోలు,
185. గోపాలపురం 

9) నరసాపురం జిల్లా
175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.

10) ఏలూరు జిల్లా
182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం 
187. చింతలపూడి
189. నూజివీడు
192. కైకలూరు

11) మచిలీపట్టణం జిల్లా
190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. ఉయ్యూరు,
197. పెనమలూరు

12) విజయవాడ జిల్లా
188. తిరువూరు
198. భవానీపురం,
199. సత్యనారాయణ పురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ
203. జగ్గయ్యపేట

13) గుంటూరు జిల్లా
205. తాడికొండ
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ

14 నరసారావుపేట జిల్లా
204. పెదకూరపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల

15 బాపట్ల జిల్లా
208. వేమూరు 
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.)

16) ఒంగోలు జిల్లా
221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి

17) నంద్యాల జిల్లా
253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్

18 కర్నూలు జిల్లా
256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు
263. యెమ్మిగనూరు,
264. కౌతలం,
265. ఆదోని,
266. ఆలూరు

19) అనంతపురం జిల్లా
267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు

20) హిందూపూర్ జిల్లా
 271. సింగనమల
275. మడకసిర
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి

21) కడప జిల్లా
243. బద్వేల్
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు

22) నెల్లూరు జిల్లా
228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ
242. ఉదయగిరి.
23) తిరుపతి 
238 సర్వేపల్లి,
 239. గూడూరు
240. సూళ్ళూరుపేట
241. వెంకటగిరి

286. తిరుపతి జిల్లా
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు
24) రాజంపేట 
244. రాజంపేట
246 కోడూరు
247. రాయచోటి
281. తంబళ్ళపల్లె
282. పీలేరు
283. మదనపల్లె
284. పుంగనూరు

25. చిత్తూరు జిల్లా
285. చంద్రగిరి
289. నగరి,
290 గంగాధరనెల్లూరు
291 చిత్తూరు,
292 పూతలపట్టు
293 పలమనేరు,
294 కుప్పం.

click me!