పీఆర్సీపై చంద్రబాబు కొంగ జపం: మంత్రి పేర్ని నాని ఫైర్

By narsimha lodeFirst Published Jan 24, 2022, 8:33 PM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశానికి సంబంధించి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని విమర్శించారు. సోమవారం నాడు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

అమరావతి: ఉద్యోగుల  PRC అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు  కొంగజపం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. సోమవారం నాడు రాత్రి ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 

ఉద్యోగులను వేధించిన చరిత్ర Chandra Babuదేనని ఆయన చెప్పారు. కానీ, ఇవాళ ఉద్యోగుల పట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నాని మందిపడ్డారు. చంద్రబాబు కొంగ జపం ఉద్యోగులకు తెలుసునన్నారు. చర్చలకు ఉద్యోగులు ఎప్పుడైనా రావచ్చని మంత్రి తెలిపారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

చంద్రబాబుకు మంత్రి Kodali Naniపై విపరీతమైన ద్వేషం ఉందన్నారు.. కాల్‌మనీ, చీటింగ్‌ కేసుల్లో ఉన్నవారితో నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. Sankranti సంబరాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 

ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని పేర్నినాని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.. రాజకీయ అవసరాల కోసం BJP  దిగజారి వ్యవహరిస్తోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అసలు ఏపీ రాష్ట్రాన్ని బీజేపీ ఏం చేయదలుచుకుందని మంత్రి నాని ప్రశ్నించారు.ఏపీలో దేశ వ్యతిరేక శక్తుల్ని పుట్టిస్తున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు.  కేంద్ర మంత్రి లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం సరైందేనా అని పేర్ని నాని ప్రశ్నించారు. 

ఈ ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయాల కోసం బీజేపీ ఏ స్థాయికి దిగజారిందో ప్రజలకు అర్థమవుతోందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంపై నోటీకి వచ్చినట్లు మాట్లాడటం కేంద్ర మంత్రి  తగదన్నారు.  రాజకీయ అవసరాల కోసం హేయంగా మాట్లాడతున్నారని ఆయన బీజేపీ నేతలపై మండిపడ్డారు.

బీజేపీ పరిపాలనలో లేని రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి పూనుకున్నారా..? అని మంత్రి ప్రశ్నించారు. ఇక్కడ దేశానికి నష్టం వాటిల్లే తప్పులు జరుగుతుంటే మీ కేంద్రం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. మీ ఐబీ, రా ఏమి చేస్తోందని మంత్రి అడిగారు.

దేశ, విదేశాల్లో దేశ పరువును నిలబెట్టాల్సిన మీరు ఇంత దిగజారి హేయంగా ప్రవర్తించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పేర్ని నాని బీజేపీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
 

click me!