పీఆర్సీ: రేపు ఉద్యోగులతో జగన్ సర్కార్ జాయింట్ కౌన్సిల్ సమావేశం

By narsimha lodeFirst Published Nov 11, 2021, 1:30 PM IST
Highlights

ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.

అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. గత నెల 29న పీఆర్సీ రిపోర్టు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా నివేదిక ఇవ్వలేదన్నారు.ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  రేపు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సఃమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. పీఆర్సీ రిపోర్టు ఇవ్వకుండా నివేదిక గురించి తాన మాట్లాడబోనని తెలిపారు. కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని ఆయన చెప్పారు. ఉనికి కోసమే కొన్ని ఉద్యోగ సంఘాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Prcపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా  ఏడాది క్రితమే నివేదికను ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు. ఉద్యోగుల ఫిట్‌మెంట్ పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో కూడా join staff Council సమావేశం జరిగింది. ఈ సమావేశంతో పాటు పీఆర్సీ నివేదికపై సీఎస్ sameer sharma  సీఎం జగన్ తో చర్చించారు. అయితే ఈ నెల 12న జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27 శాతంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై  ఐఆర్ 27 శాతానికి పరిమితం చేయడంపై ఉద్యోగ సంఘాలు అంగీకరించడానికి సిద్దంగా లేవు. వేతన ఫిట్ మెంట్ పై కూడా కనీసం 60 శాతంగా ఉండాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి నెలకొంది.

Also read:పీఆర్సీ రిపోర్ట్ ఇస్తారా, ఇవ్వరా.. లేకుంటే: ఏపీ సర్కార్‌కు ఉద్యోగ సంఘాల అల్టీమేటం

సీఎస్‌ ప్రకటన కోసం కొన్ని గంటలుగా నిరీక్షిస్తున్నామని తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతు మండిపడ్డారు. పీఆర్‌సీ నివేదికను సీల్డ్‌ కవర్‌లో పెట్టడం వింతగా ఉందని.. నివేదికకే ఇబ్బంది పెడితే ఇక పీఆర్‌సీ ఎలా ఉంటుందోనంటూ  ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం నాడు  అభిప్రాయపడ్డారు.


 

click me!