Amaravati Maha Padayatra: ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎఫెక్ట్... అమరావతి రైతులకు పోలీసుల నోటీసులు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Nov 11, 2021, 12:03 PM IST
Amaravati Maha Padayatra: ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎఫెక్ట్... అమరావతి రైతులకు పోలీసుల నోటీసులు (వీడియో)

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం మహా పాదయాత్రపై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ పడింది. 

అమరావతి: వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేవలం అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు, మహిళలు మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట అమరావతి నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ పాదయాత్ర చేపడుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు  అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

Amaravati farmers కు సంఘీభావంగా కాంగ్రెస్, టీడీపీ, బీజీపీ, సీపీఐ నేతలు కూడా ఈ maha padayatra పాల్గొంటున్నారు. అయితే  mlc elections సందర్భంగా ఎలక్షన్ కోడ్ (model code of conduct) అమల్లో ఉన్నందున  పాదయాత్రలో ఇతరులు పాల్గొన కూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి పొందిన రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

వీడియో

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని రాజధాని రైతుల మహాపాదయాత్ర శిబిరం వద్దకు జిల్లా పోలీస్ యంత్రాంగం చేరుకుని ఈ నోటీసులు అందించారు. అయితే పోలీసుల నోటీసులపై Amaravathi JAC నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా పాదయాత్ర చేస్తుంటే తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసు ఇవ్వడమేంటని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

READ MORE  నా నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర వద్దు: పోలీసులను కోరిన వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభానికి ముందే పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే high court కు వెళ్లిన అమరావతి జేఏసీ పాదయాత్రకు అనుమతి సాధించింది. రైతుల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పాదయాత్రపై పోలీసులు మరిన్ని షరుతులు విధించారు. 

అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.  మొదటి 6రోజులు గుంటూరు జిల్లాలో కొనసాగిన పాదయాత్ర ఇటీవల పర్చూరు వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. పదిరోజుల పాటు ప్రకాశంలో జిల్లాలో పాదయాత్ర కొనసాగి 18వ తేదీన కావలి వద్ద నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తుంది.  ఈ జిల్లాలో 16రోజులపాటు యాత్ర సాగి డిసెంబర్ 4న చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. డిసెంబర్ 15న చిత్తూరు జిల్లాలోని తిరుమలకు చేరుకోవడంతో పాదయాత్ర ముగుస్తుంది. 

READ MORE  ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఎమ్మెల్యే కోటాలో వైసీపీ అభ్యర్ధులు వీరే.. !!

ఇదిలావుంటే  ఆంధ్రప్రదేశ్ MLC election schedule విడుదలయ్యింది. నవంబర్ 9, మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పు గోదావరి -1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.  

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్