టీటీడీ బంపర్ ఆఫర్... ఆర్టీసీ బస్సులో శ్రీ‌వారి శీఘ్ర ద‌ర్శ‌నం టికెట్లు..

Published : Feb 05, 2021, 09:12 AM IST
టీటీడీ బంపర్ ఆఫర్... ఆర్టీసీ బస్సులో శ్రీ‌వారి శీఘ్ర ద‌ర్శ‌నం టికెట్లు..

సారాంశం

తిరుమల శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు వచ్చే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి.. బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ తీసుకోవచ్చు. 

ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు, సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు ఉంటుంది. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. 

కాబట్టి తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ కోరుతుంది. ప్రతి రోజు ఏపిఎస్ఆర్టీసీ తిరుపతికి 650 బస్సులు నడుపుతుంది. 

ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి దైవ దర్శనానికి వచ్చే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం. 

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సదవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, ఈ.ఓ.కే.ఎస్. జవహార్ రెడ్డికి భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works