లైంగిక వేధింపులు: నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండ్ సస్పెన్షన్

By narsimha lode  |  First Published Jun 7, 2021, 9:26 PM IST

వైద్య విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండ్ ప్రభాకర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
 


నెల్లూరు:వైద్య విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండ్ ప్రభాకర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.వైద్య విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కూడ స్పందించారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా డాక్టర్ ప్రభాకర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.

also read:వైద్య విద్యార్థినిపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులు... మహిళా కమీషన్ సీరియస్ (వీడియో)

Latest Videos

విచారణ సమయంలో నెల్లూరును వదిలి వెళ్లకూడదని కూడ ప్రభుత్వం ఆదేశించింది.  ఈ ఆడియో లీక్ కావడంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఆమె మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె  ఆదేశించారు.వైద్య వృత్తికే మచ్చ తెచ్చే  ఈ తరహ ఘటనలు ఉపేక్షించబోమని ప్రభుత్వం తెలిపింది. వేధింపులకు గురైన యువతులు, మహిళలు తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ కోరింది. ఈ మేరకు వాట్సాప్ నెంబర్ ను కూడ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. 

click me!