అలా అయితే జగన్‌పైనే కేసు నమోదు చేయాలి: లోకేష్

By narsimha lodeFirst Published Jun 7, 2021, 8:29 PM IST
Highlights

ప్రశ్నించే వారిపై పగ సాధిస్తూ ఎన్నాళ్లీ ప్రతీకార పాలన చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.

అమరావతి:ప్రశ్నించే వారిపై పగ సాధిస్తూ ఎన్నాళ్లీ ప్రతీకార పాలన చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.కోవిడ్ ప్రోటోకాల్స్ సంగం డెయిరీ పాలకవర్గం సమావేశం నిర్వహించినా  కూడ తప్పుడు కేసుల పెట్టారన్నారు.  ఆనందయ్యను అనధికారికంగా బందీ చేసి మందును వెబ్‌సైట్ లో పెట్టి అడ్డంగా అమ్ముకొందామని బ్లీచింగ్ రెడ్డి ప్లాన్ ని బట్టబయలు చేశారనే కక్షతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరో తప్పుడు కేసు బనాయించారని ఆయన చెప్పారు. ఎన్నాళ్లీ ప్రతీకార పాలన సాగిస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రశ్నించేవారిపై తప్పుడు కేసుల బనాయించాలని ఫేక్ సీఎం ఒత్తిడి తెస్తే రాజ్యాంగం చదవి చట్టం తెలిసిన పోలీసుల బుద్ది ఏమైందని ఆయన ప్రశ్నించారు.  అన్యాయమైన కేసులు, అక్రమ అరెస్టులు చేసి న్యాయస్థానాల్లో దోషులుగా నిలవడానికి పోలీసులకు సిగ్గు అనిపించకపోవడం విచారకరమన్నారు.

కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం కేసు పెట్టాల్సి వస్తే ప్రతి రోజూ మాస్క్ వేసుకోకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ పైనే కేసు నమోదు చేయాలన్నారు.  నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిసతున్న  వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు బుక్ చేయాల్సి వస్తోందన్నారు. గన్‌మెన్‌తో బూట్ల మోయిస్తూ బహిరంగ సభ నిర్వహించిన గిద్దలూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

click me!