చుక్కల మందులో హాని కల్గించే పదార్ధం: హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదిక

By narsimha lode  |  First Published Jun 21, 2021, 3:16 PM IST

 ఆనందయ్య పంపిణీ చేసే చక్కల మందులో  కంటికి హానిచేసే పదార్ధం ఉందని ల్యాబ్ నివేదికలు వెల్లడించినట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 
 


అమరావతి:  ఆనందయ్య పంపిణీ చేసే చక్కల మందులో  కంటికి హానిచేసే పదార్ధం ఉందని ల్యాబ్ నివేదికలు వెల్లడించినట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య చుక్కల మందుపై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఆనందయ్య మందును ఐదు ల్యాబ్ ల్లో పరీక్షించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ఒక్క ల్యాబ్ లో మాత్రం కంటికి హాని కల్గించే పదార్ధం ఉందని  తేలిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 

also read:ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందయ్య మందు..!

Latest Videos

ఈ ల్యాబ్ ల నివేదికను తమ ముందు ఉంచాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చుక్కల మందును ఆయుష్ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్ కోరారు.  ఈ విషయమై ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.ఆనందయ్య మందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఈ మందును ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!