అమరావతిపై ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పణ: పిటిషన్లపై విచారణ ఆగష్టు 23కి వాయిదా

By narsimha lode  |  First Published Jul 12, 2022, 11:29 AM IST

అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాతే వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.ఈపిటిషన్లపై విచారణను ఈ ఏడాది ఆగష్టు 23కి వాయిదా వేసింది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.



అమరావతి: Amaravathi  రాజధానిపై Andhra Pradesh  ప్రభుత్వం మంగళవారం నాడుAP Hig Court లో స్టేటస్ రిపోర్టును దాఖలు చేసింది. Status Report ను పరిశీలించిన తర్వాతే వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణను ఈ ఏడాది ఆగష్టు 23కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

Capital City పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారణను ప్రారంభించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని రైతుల తరపు న్యాయవాది ఉజ్జం మురళీధర్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టు పరిశీలించిన తర్వాతే  మీ వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం రైతుల తరపు న్యాయవాది మురళీధర్ కు స్పష్టం చేసింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై విచారణను ఈ ఏడాది ఆగష్టు 23వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Latest Videos

undefined

also read:అమరావతిపై పిటిషన్లు: నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు

ప్రభుత్వ స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా రైతుల తరపు న్యాయవాదికి సూచించింది. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే ఈ విషయమై ఉన్న ఫైల్ ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకొంటామని ఏపీ హైకోర్టు తెలిపింది. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఏపీ హైకోర్టు ఈ ఏడాది మే 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరావతి రాజధానిపై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయమై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టుగా కూడా న్యాయవాదులు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు.

 ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. అయితే స్టేటస్ రిపోర్టును పరిశీలించాల్సిన తర్వాతే ఇరు వర్గాల వాదలను వింటామని ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది మార్చి మూడో తేదీన ఏపీ హైకోర్టు అమరావతిపై కీలక తీర్పును ఇచ్చింది.శాసన, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రాజధానిలో  డ్రైనేజీలు, మంచినీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశించింది. 

click me!