ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకు మంగళవారం నాడు రాజధాని పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఏపీ రాజధాని అమరావతి విషయమై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. మరో వైపు రాజధానిలో భూముల విక్రయంపై కూడా ఇవాళ పిటిషన్లు దాఖలు చేసే అవకాాశం ఉంది.
గుంటూరు:AP High Court ముందు రాజధాని పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఏపీ రాజధాని Amaravati విషయమై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని Contempt of Court, కూడా దాఖలైన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్లపై మంగళవారం నాడు ఉదయం ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ నిర్వహించనుంది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించనుంది. Capital విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయని విషయాన్ని కూడా పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అంతేకాదు కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ విషయమై స్టేటస్ రిపోర్టును ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అమరావతిలో భూముల అమ్మకం విషయమై రైతుల తరపున పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఏపీ హైకోర్టు ఈ ఏడాది మే 6వ తేదీన ఆదేశించింది. అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో పనుల పురోగతిని నివేదించాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయమై ఈ ఏడాది మార్చి మూడో తేదీన ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శాసన, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. అమరావతిలో మౌళిక వసతులను నెల రోజుల్లోనే కల్పించాలని కోరింది. డ్రైనేజీలు, మంచినీరు, రోడ్లు ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించింది.
మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్ 3 లోపుగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు కోరింది. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు గతంలోనే నివేదించింది. 2024 జనవరి వరకు సమయం ఉందని హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ గతంలోనే అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు.
also read:మున్సిపల్ కార్మికులతో ఏపీ మంత్రుల చర్చలు విఫలం: సమ్మె కొనసాగిస్తామన్న కార్మిక సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీసర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. ఏపీకి మూడు రాజధానుల విషయాన్ని 2019 డిసెంబర్ 17న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయమై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. శాసనమండలిలో కూడా బిల్లును పంపారు. అయితే శాసనమండలిలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభభుత్వం చట్టం తెచ్చింది. దీనిపై రాజధానిపై రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆందోళన నిర్వహించారు.